అల్లిపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులకు వచ్చే నెల 2వ తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు నగర పోలీసులు తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. వారు బుధవారం నిందితులను రెండవ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రే ట్ ముందు హాజరుపరిచారు. కోర్టు నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment