సీతంపేట: జిల్లాలో నెలరోజుల పాటు జరిగిన ప్రత్యేక డ్రైవ్లో 33 మంది బాల కార్మికులను గుర్తించినట్టు ఉప కార్మిక కమిషనర్ ఎం.సునీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాల కార్మికులను గుర్తించడానికి జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాల్లో అక్టోబరు 21 నుంచి నవంబరు 20 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. కనీస వేతనాల చట్టం కింద 33 కేసులు ఫైల్ చేసి.. యాజమాన్యాల నుంచి కనీస వేతనాల వ్యత్యాసాల కింద రూ.1,26,325లు జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. బాల కార్మిక చట్టం కింద 5 దుకాణాలు గుర్తించి వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసి, ఒక్కొక్క యాజమాన్యం నుంచి రూ.20 వేలు చొప్పున జరిమానాలు వసూలు చేసినట్టు తెలిపారు. బాల కార్మికుల చట్టం కింద 3 దుకాణాలపైన రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద 3 కేసులు ఫైల్ చేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment