సింహాచలం: వచ్చేనెల 2న పోలి పాడ్యమిని పురస్కరించుకుని సింహగిరి దిగువ వరాహ పుష్కరిణి వద్ద దీపాలు విడిచిపెట్టేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు తెలిపారు. పుష్కరిణి నీటిలోకి ఎవరూ దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెట్ కూడలి నుంచి పుష్కరిణికి వెళ్లే మార్గంలో పోలీస్ బందోబస్తుతో పాటు దేవస్థానం కమ్యూనిటీ గార్డులను ప్రత్యేకంగా బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్కెట్ కూడలి నుంచి వరాహ పుష్కరిణి వరకు ఎలాంటి వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వర్తిస్తారని తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యేక డ్యూటీలు వేసినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment