మహారాణిపేట: ఆహార కల్తీ కేసులకు సంబంధించి వ్యాపారులకు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ భారీగా జరిమానా విధించారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో పలు షాపులు, హోటళ్లలో నమూనాలు సేకరించి.. లేబొరేటరీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ నమూనాలను సంబంధించి నాణ్యాత ప్రమాణాలు లేనట్లు నివేదికలు రావడంతో సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకున్నట్టు అసిస్టెంట్ పుడ్ కంట్రోలర్ జీవీబీ నందాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులను జేసీ కోర్టులో విచారించి.. మొత్తం ఏడు కేసుల్లో వ్యాపారులకు రూ.2.80 లక్షల జరిమానా విధిస్తూ జేసీ మయూర్ అశోక్ తీర్పు చెప్పారు. శ్రీ విజయ విశాఖ పార్లర్(టోన్డ్ మిల్క్)కు రూ. 2 లక్షలు, దాబా సిటీ పంజాబ్(పెరుగు), గున్నరాజు ఎంటర్‌ప్రైజెస్(బెల్లం)కు రూ.20 వేలు చొప్పున, టేస్టీ మసాలా(పెసర పప్పు)కు రూ.15 వేలు, సుప్రజ ఫుడ్(ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్)కు రూ.10 వేలు, గోపాలకృష్ణ ప్రొడక్ట్స్(టమాటా సాస్)కు రూ.10 వేలు, బెంగుళూర్ అయ్యంగర్ బేకరీ(బ్రెడ్)కు రూ.5 వేలు జరిమానా విధించినట్లు నందాజీ తెలిపారు. ఈ వస్తువులు కల్తీ లేదా నాణ్యాత ప్రమా ణాలు లోపించడం, నకిలీ బ్రాండెడ్ ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ, స్టాండర్ట్స్ చట్టం 2006 కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment