విశాఖ లీగల్ : ఇటీవల న్యాయ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు బెయిలు ఇవ్వొద్దని విశాఖ న్యాయవాదుల సంఘం నినదించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కోర్టు బయట నిరసన కార్యక్రమం చేపట్టారు. సహ న్యాయ విద్యార్థిపై ఆమె మిత్రుడుతో పాటు వంశీ, బొడ్డు జగదీష్, పోలిపల్లి ఆనంద్, దేవులపల్లి రాజేష్ సంయుక్తంగా హింసించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇందులో ఆనంద్ మినహా మిగతా ముగ్గురు న్యాయ విద్యార్థులే. వీరందర్నీ రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. నిందితలకు ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులను ఉద్దేశించి విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ మాట్లాడారు. న్యాయ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ఇందులో ఏ ఒక్కరికి బెయిల్ రాకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జె.పృథ్వీరాజ్, పలకా శ్రీరామ్ముర్తి, రామాంజనేయులు, డి.పద్మారాణి, బి.లక్ష్మి రాంబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment