సహిత విద్య విజయవంతానికి కృషి
విశాఖ విద్య : దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు దీనిలో భాగంగా అమలు చేస్తున్న సహిత విద్యను విజయవంతం చేయాలని ఆర్జేడీ విజయభాస్కర్, డీఈవో ప్రేమ్‌కుమార్ అన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో సహిత విద్యపై హార్బర్ రోడ్‌లో గల ఏపీహెచ్‌ఆర్‌డీఐలో మంగళవారం ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో సహిత విద్యా కార్యక్రమాల అమలుపై వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రకాల సదుపాయాలు అందుతున్నాయా లేదా అనేది ఎంఈవోలు పరిశీలన చేయాలన్నారు. భవిత కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో దివ్యాంగుల నమోదు, పాఠశాలల్లో వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, యు డైస్ ప్లస్ సర్వే వంటి అంశాలపై ఎంఈవోలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర స్థాయి అబ్జర్వర్లు వై.నరసింహం, అమ్మినాయుడు సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయిలో కల్పిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఏఎల్‌ఎస్‌సీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, సహిత విద్య డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ బి.గీత, సమగ్రశిక్ష సెక్టరియల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment