నదులు, వాగుల్లోని ఇసుకనే కాదు.. అధికార టీడీపీ కూటమి నేత
● ఖనిజాల కోసం రాత్రి పూట అక్రమంగా రాష్ట్రం దాటిపోతున్న ఇసుక ● కందకాలుగా మారిపోతున్న సాగర తీరం ● సీ బెడ్‌కు మీటరు లోతులోనే ఖనిజ నిక్షేపాలు ● రెండు మీటర్లకు పైగా తవ్వకాలు చేస్తున్న ఇసుక దొంగలు ● గార్నైట్, జిర్కోనియం, సిలిమినైట్ వంటి ఖనిజాల కోసమే దోపిడీ ● ఫిర్యాదులొస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: భీమిలి తీరంలో అరుదైన ఖనిజ నిక్షేపాలుండటంతో అక్రమ తవ్వకాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇక్కడ బీచ్ రోడ్డు వెంబడి తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతంలో రాత్రి సమయాల్లో కొందరు లారీలు, మినీ వ్యాన్‌ల ద్వారా ఇసుకను తవ్వి అక్రమంగా తరలించేస్తున్నారు. ఫలితంగా పెద్దపెద్ద గోతులు ఏర్పడుతూ తీరప్రాంత భద్రతని కలవరపెడుతోంది. ఇప్పటికే తుపాను సమయాల్లో రుషికొండ, ఐటీ జంక్షన్, సాగర్‌నగర్, తిమ్మాపురం, మంగమారిపేట, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సముద్రం పెద్దఎత్తున కోతకు గురవుతోంది. ఇప్పుడు కూటమి నేతల ఇసుక దందాతో 2–3 మీటర్ల మేర భారీ గోతులు దర్శనమిస్తున్నాయి. ఈ తరహా గోతులతో ఆటుపోట్ల సమయంలో తీరం కోతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.
అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలివి..
భీమిలి తీరంలో లభ్యమయ్యే ఖనిజాలు అత్యంత అరుదైనవని జీఎస్‌ఐ భావిస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే గార్నెట్ నిక్షేపాలను శాండ్ బ్లాస్టింగ్, వాటర్ జెట్ కటింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ కోసం వినియోగిస్తారు. ఇలిమినేట్, రూటిల్, లికాక్సిన్ వంటి మినరల్స్‌ను సింథటిక్ రూటిల్స్, టైటానియం డైయాక్సిడ్ పిగ్మెంట్, టైటానియం స్పాంజ్, టైటానియం టెట్రాక్లోరైడ్, టైటానియం మెటల్ తయారీకి వినియోగిస్తారు. అత్యంత అరుదుగా లభించే టైటానియం మెటల్స్‌ను ఎయిర్‌క్రాఫ్ట్ట్స్ స్పేస్ షటిల్స్, వైద్య పరికరాల తయారీలో వినియోగిస్తుంటారు. ఇందుకోసమే ఎక్కువ లోతులో ఇసుకని తవ్వి చైన్నె, కేరళకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment