ఇక కూటమి నేతలు సముద్ర తీరాన్ని విధ్వంసం చేస్తూ.. భారీ గుంతలు తవ్వుతూ ఇసుకను దోచేస్తున్నా అధికారులు మాత్రం అలాంటివేమీ జరగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నా పట్టించుకోవడంలేదు. సీఆర్‌జెడ్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకపోయినా.. టన్నుల కొద్దీ ఇసుక తరలిపోతుండటంతో మత్స్య సంపదకు విఘాతం కలుగుతోందని స్థానికులు భీమిలి డివిజన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అవన్నీ తీరంలోనే కప్పేస్తున్నారు తప్ప.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం అడుగు ముందుకెయ్యడంలేదు. పైగా.. కూటమి నేతల ఇసుక దాహాన్ని కప్పిపుచ్చే విషయంలో మాత్రం జిల్లా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు ఎంతో సమన్వయం పాటిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment