కి
బార్లా తెరిచారు..
● కొత్తగా మరో 8 బార్లు, 2 ప్రీమియం స్టోర్లకు నోటిఫికేషన్
● వ్యాపారాలు లేక తలలు పట్టుకుంటున్న వైన్‌షాప్, బార్ల నిర్వాహకులు
● వైన్‌షాపులకు 12 శాతానికి మించి రాని కమీషన్
● బార్లకు తగ్గిన వ్యాపారం.. నిర్వహణ భారంతో సతమతం
విశాఖ సిటీ: మద్యం విక్రయాల ద్వారా వచ్చే సొమ్ము ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ ఆదాయం పొందేందుకు ప్రభుత్వం మరిన్ని బార్లు, లిక్కర్ షాపుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తాజాగా జిల్లాలో 8 బార్లకు, 2 ప్రీమియం లిక్కర్ స్టోర్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తులు, లైసెన్సులతో పాటు మద్యం విక్రయాల ద్వారా ఖజానా నింపుకోవాలని భావిస్తోంది. లిక్కర్‌పై కమీషన్ సరిపోక వైన్‌షాప్, బార్ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఖజానా నింపుకోవడానికి ఇప్పుడు మరిన్ని బార్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం తమను బలిచేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిమితికి మించి బార్లు
జిల్లాలో బార్ల సంఖ్య ఇప్పటికే పరిమితికి మించి ఉంది. ప్రస్తుతం విశాఖలో 127 బార్లు ఉన్నాయి. గతంలో ప్రభుత్వమే లిక్కర్ షాపులు నిర్వహించింది. తొలుత రాత్రి 8 గంటలకే ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేయడంతో ఆ త రువాత బార్లకు మంచి వ్యాపారం జరిగేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో కంటే ఎక్కువగా ప్రైవే టు మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయించింది. వీటి ద్వారా రాత్రి 10 గంటల వరకు విక్రయాలకు అనుమతులు ఇచ్చారు. దీంతో బార్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. చాలా మంది బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు వ్యాపా రాన్ని లీజుకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 20 వరకు బార్లు అధికంగా ఉండగా.. తాజాగా మరో 8 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి ద్వారా రూ.కోట్లను ఆర్జించాలని చూస్తోంది. ఉన్న బార్లకే వ్యా పారం లేకపోగా కొత్తగా బార్లకు అనుమతులు ఇస్తుండడం పట్ల ప్రస్తుత బార్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా రెండు ప్రీమియం లిక్కర్ స్టోర్లు
జిల్లాలో 155 వైన్‌షాపులను లాటరీ ద్వారా కేటాయించారు. ఇప్పుడు కొత్తగా రెండు ప్రీమియం లిక్కర్ స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతమున్న వైన్‌షాపులకే అంతంత మాత్రంగా వ్యాపారం జరుగుతోంది. ప్రధానంగా దరఖాస్తు సమయంలో వ్యాపారులకు కమీషన్ 20 శాతం ఉంటుందని ప్రకటించిన కూటమి ప్రభుత్వం.. ఆ తరువాత మాత్రం విచిత్రమైన పన్నుల రూపంలో 7 నుంచి 8 శాతం మేర కమీషన్‌లో కోత పెట్టింది. మద్యం వ్యాపారం ద్వారా రూ.కోట్లు సంపాదించవచ్చని కొండంత ఆశతో రూ.లక్షలు, రూ.కోట్లు ఖర్చు చేసి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసి మరీ మద్యం షాపులు దక్కించుకున్న వారికి ఇప్పుడు.. 12 శాతానికి మించి కమీషన్ రావడం లేదు. దీంతో నిర్వహణ భారంతో నిర్వాహకులు సతమతమవుతున్నారు. ఫలితంగా ఏ రోజుకు ఆ రోజు మద్యం విడిపించుకుంటూ విక్రయాలు చేస్తున్నారు.
క్కే
Comments
Please login to add a commentAdd a comment