సీతంపేట: వివిధ సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు 2025 సంవత్సరానికి వేతనంతో కూడిన పండగలు, జాతీయ సెలవుల క్యాలెండర్‌ను జోన్–1 సంయుక్త కార్మిక కమిషనర్ ఎం.సునీత మంగళవారం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం 1988, ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీలు, సంస్థలు చట్టం 1974 ప్రకారం ఈ సెలవులు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని సంస్థలు, ఫ్యాక్టరీలు ఈ సెలవులను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
జాతీయ సెలవులు : రిపబ్లిక్ డే, జనవరి 26(ఆదివారం), మే డే, మే 1(గురువారం), స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15(శుక్రవారం) గాంధీ జయంతి, అక్టోబరు 2 (గురువారం), ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, నవంబర్ 1 (శనివారం).
పండగ సెలవులు : కనుమ, జనవరి 15 (బుధవారం), మహా శివరాత్రి, ఫిబ్రవరి 26 (బుధవారం)
రంజాన్, మార్చి 31 (సోమవారం), క్రిస్మస్, డిసెంబర్ 25 (గురువారం).
వెనుదిరిగిన విమానాలు
Comments
Please login to add a commentAdd a comment