పీఆర్‌ఎస్‌ఐ అవార్డు గ్రహీతలకు మేయర్ అభినందనలు
అల్లిపురం : పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల రాయపూర్‌లో నిర్వహించిన 46వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీతోపాటు నగరంలోని పలు సంస్థలు 11 జాతీయ అవార్డులు దక్కించుకోవడం అభినందనీయమని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవోలు ప్రజలను చైతన్యం పరిచేలా చేపట్టిన కార్యక్రమాలు నగర భవిష్యత్‌కు దోహదపడతాయన్నారు. ఉత్తమ ప్రజా అవగాహన కేటగిరీలో అవార్డును జీవీఎంసీ సొంతం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం పీఆర్‌ఎస్‌ఐ చాప్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు రెండు అవార్డులు, జేడీ ఫౌండేషన్‌కు ఒకటి, కొల్లూరు రామారావుకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, పీఆర్‌ఎస్‌ఐ సెక్రటరీ జనరల్, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ డాక్టర్ పీఎల్‌కే మూర్తి, చాప్టర్ చైర్మన్, హెచ్‌పీసీఎల్ మాజీ పీఆర్‌వో కాళీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment