జూ క్యూరేటర్‌గా మంగమ్మ బాధ్యతల స్వీకరణ
ఆరిలోవ : ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు క్యూరేటర్‌గా జి.మంగమ్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ క్యూరేటర్‌గా పనిచేసిన డాక్టర్ నందనీ సలారియా గత అక్టోబరులో మంగళగిరికి బదిలీ కాగా.. అప్పటి నుంచి మంగమ్మ అదనపు క్యూరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈనెల 24న ఆమెకు క్యూరేటర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ అటవీ శాఖ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె గురువారం పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జూ అసిస్టెంట్ క్యూరేటర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్, ఎఫ్‌ఎస్‌వోలు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment