● భారీగా మద్యం విక్రయాలు
● 30, 31 తేదీల్లో
రూ. 23 కోట్లు తాగేశారు
● 1వ తేదీన రూ.12 నుంచి రూ.15 కోట్ల
విక్రయాలకు అవకాశం?
విశాఖ సిటీ: మందుబాబులకు కొత్త సంవత్సరం ముందే వచ్చేసింది. 30వ తేదీ నుంచే సెలబ్రేషన్స్ ప్రారంభించేశారు. మద్యం కిక్కును ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే రూ.23 కోట్ల మద్యం తాగేశారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎకై ్సజ్ శాఖ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని కూటమి ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగానే 31, 1వ తేదీల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఈ రెండు రోజులు రూ.30 కోట్లు మేర ఆదాయం వస్తుందని ఎకై ్సజ్ అధికారులు సైతం భావిస్తున్నారు. అయితే అనూహ్యంగా కొత్త సంవత్సరానికి ముందే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. ఆదివారం నుంచే మందుబాబులు న్యూ ఇయర్ జోష్‌లో ఉన్నారు. దీంతో 30న రూ.14.5 కోట్లు అమ్మకాలు జరిగితే.. 31న రూ.8.5 కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. ఈవెంట్ల నిర్వహకులతో పాటు పార్టీలు చేసుకునే వారు ముందస్తుగానే మద్యం కొనుగోలు చేశారు. ఫలితంగా నూతన సంవత్సరానికి ముందే మద్యం ఆదాయం పెరిగింది. ఒకటో తేదీన రెట్టింపు స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ న్యూ ఇయర్‌లో ఎకై ్సజ్ శాఖ ద్వారా రూ.35 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment