మహారాణిపేట : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 4వ తేదీన విశాఖ వస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.45 నుంచి 4.15 గంటల వరకు విమానాశ్రయంలో సీఎం టూర్ రిజర్వ్‌లో ఉంచారు. 4.15 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి బయలు దేరి ఆర్కే బీచ్‌కు చేరుకుంటారు. 4.40 గంటల నుంచి 6.10 గంటల వరకు బీచ్‌లో జరిగే నేవీ విన్యాసాల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి విమానాశ్రయానికి చేరుకొని.. సాయంత్రం 6.50 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు.
నేడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాక
మహారాణిపేట: జిల్లా ఇన్‌చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి శుక్రవారం ఉదయం 8.35 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌కు చేరుకుంటారు. అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో అధికారులు, కూటమి నాయకులతో ఈనెల 8న విశాఖ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు.
నేడు పట్టణ ప్రణాళిక విభాగంపై
ఫిర్యాదుల స్వీకరణ
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంపై ఫిర్యాదులు స్వీకరించనున్నట్టు జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించనున్న కార్యక్రమంలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment