దేవన్‌రెడ్డికి ఘన స్వాగతం
గాజువాక : వైఎస్సార్‌సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన తరువాత ఆదివారం గాజువాక చేరుకున్న తిప్పల దేవన్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. కూర్మన్నపాలెం నుంచి పాతగాజువాక, కొత్తగాజువాక, బీసీ రోడ్ మీదుగా మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇంటి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. తండ్రి నాగిరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలే తమకు శిరోధార్యమని, ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment