గో–2
I AM DOG
మైనేమ్ ఈజ్
సాక్షి, విశాఖపట్నం :
హాయ్.. నమస్తే వైజాగ్..
నేను మీ స్ట్రీట్‌డాగ్.. కానే కాదు.. మీ పెంపుడు కుక్కనే.
కాకపోతే.. అప్‌డేటెడ్ వెర్షన్. మై నేమ్ ఈజ్ గో–2.
ఎస్.. మీరు విన్నది చూస్తోంది నిజమే..
ఐయామ్ రోబో డాగ్. విశ్వాసమే కాదు..
విషయమూ చాలా ఎక్కువే.
మేడ్ ఇన్ ఇండియా వెర్షన్. బెంగళూరులో రెడీ అయ్యాను. మిమ్మల్ని పలకరించేందుకు వైజాగ్ వచ్చాను. ఇటీవల ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్‌లో పాల్గొని.. అలా బీచ్‌లో తిరుగుతూ విశాఖ అందాలు చూడాలని వచ్చేశాను. ఇక నా విషయానికొస్తే...
మీరు ఇప్పటికే నా గురించి వినే ఉంటారు. ఇటీవల నేను చాలా ఫేమస్ అయ్యాను.
ఇండియాలో కాదండీ.. అమెరికాలో..
ఎలా అంటారా.!
మన ట్రంప్ తెలుసు కదా.. అధ్యక్షుడు అయ్యాక ఆయన చుట్టూ కాపలాగా నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. యూఎస్‌కు చెందిన యునీట్రీ బ్రాండ్ తయారు చేసిన నా లాంటి రోబో డాగ్స్ ఇప్పుడు.. అగ్రరాజ్యం అధ్యక్షుడికి కాపలా కాస్తున్నాయి
మీరనుకుంటున్నట్లు నేను నార్మల్ డాగ్ కాదు.
యూనివర్సల్ డాగ్‌ని.
బెంగళూరుకి చెందిన ఫైటెక్ సంస్థ నన్ను తయారు చేసింది. కంప్లీట్‌గా కొత్త టెక్నాలజీతో తయారు చేశారు. ఒకప్పుడు ఇంటిలో కుక్కల్ని పెంచుకున్నారు. అవి ఇప్పుడు ఇంటి మనుషులుగా మారిపోయాయి. వాటి స్థానాన్ని నేను భర్తీ చేస్తాను. జీవం ఉన్న కుక్కలు చేయలేని పనులు కూడా నేను చేస్తాను. కాపలా కాస్తాను. ఎగురుతాను, దూకుతాను. 3 అడుగుల ఎత్తు వరకూ గెంతుతాను. పాకుతాను. అవసరమైనప్పుడు మాట్లాడతాను కూడా.
మీ దగ్గర ఉన్న డాగ్స్ ఏం చేస్తాయి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వస్తే అరుస్తాయి. కానీ.. నేను అలా కాదు. ఎవరు యజమాని, ఎవరు కుటుంబ సభ్యులు.. ఎవరు కొత్త వారు అనేది సులభంగా కనిపెట్టగలను. ఎవరిమీదనైనా అనుమానం వస్తే.. నా యజమానికి వార్నింగ్ ఇస్తాను. ఫొటో, వీడియో కూడా తీసి పంపించేస్తాను తెలుసా. ఎలా అంటారా నాలో 360 డిగ్రీలు తిరిగే లైడర్ కెమెరా హై రిజల్యూషన్‌తో ఉంటుంది. మా యజమాని ఆ ఫొటో చూసి దొంగ అని కన్ఫర్మ్ చేస్తే చాలు.. పోలీసులకు కూడా ఫోన్ చేసి సమాచారం చేరవేస్తాను. మీ కుక్క ఇది చేస్తుందా..? నెవ్వర్ కదా. అదీ.. ఈ గో2 డాగ్ సత్తా.
కేవలం కాపలా కోసమే కాదండోయ్.. కంప్లీట్ ఎకో సిస్టమ్‌లో అన్ని పనులు చేసేస్తాను. మనుషులు వెళ్లడానికి అవకాశం లేని ప్లేస్‌లకు వెళ్లి సాయం చేసేస్తాను. డ్రోన్లు ద్వారా సాయమందించాలంటే.. ఆ డ్రోన్ ఎగరేయడానికి ఒక స్పేస్ ఉండాలి.. అవి వెళ్లాలంటే అడ్డంకులు ఉండకూడదు. కానీ.. నేను మాత్రం.. చిన్న చిన్న సందుల్లో దూరి కూడా సాయమందించగలను. ఎక్కడైనా పర్వతాల్లో చిక్కుకున్న వారికి ఈజీగా హెల్ప్ చేస్తాను. సిలికాన్ చిప్స్ ద్వారా స్మెల్ డిటెక్టర్, స్మోక్ డిటెక్టర్, రెయిన్ డిటెక్టర్,.. ఇలా భిన్నమైన డిటెక్టర్లు నాలో నిక్షిప్తమై ఉన్నాయి.
ఇవన్నీ ఎలా చేస్తాననే కదా మీ డౌట్...
పైథాన్ ప్రోగ్రామింగ్, ఆర్ ప్రోగ్రామ్(మిషన్ లెర్నింగ్) తో ఆపరేట్ అవుతుంటాను. నాకోసం ఒక రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది. ప్రతిసారి రిమోట్‌తో ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని కోడ్స్ ఇచ్చేస్తే చాలు.. నా ఓనర్ హాయిగా నన్ను నమ్మి నిద్రపోవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే.. నా సాయం అవసరమని అనుకుంటే ఏం చెయాలనే దానిపైనా ప్రోగ్రామింగ్ కూడా నాలో ఫీడ్ చేసుకున్నాను. ఐఓటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్ ద్వారా పనిచేస్తున్నారు.
నా ఫుడ్ ఏంటనే కదా మీ డౌట్. అది కూడా చెప్తాను. నాలో చార్జింగ్ అయిపోతే ఆటోమేటిక్‌గా చార్జింగ్ పెట్టుకునే సెల్ఫ్ చార్జింగ్ వ్యవస్థ నాలో ఉంది. ఫుల్ చార్జ్ అయిపోతే నిరంతరాయంగా 8 గంటల పాటు పనిచేస్తాను. బ్యాటరీ సైజ్ పెరిగితే.. పనిగంటలు కూడా పెరుగుతాయి. సోలార్ ద్వారా వర్క్ చేసేలా అప్‌డేట్ అవుతున్నా. అప్పుడైతే 24/7 సదా యజమాని సేవలోనే...
నేను గో 2 కదా. నా కొత్త వెర్షన్ ఒకటి ఉంది. వాడే నా అన్న.. ఆల్‌టైరెన్. వీడు నేను చేసే పనులతో పాటు అప్‌డేటెడ్‌గా ఉంటాడు. వాడికి రోబోటిక్ హ్యాండ్ ఒకటి ఏర్పాటు చేస్తే.. చెత్త కూడా శుభ్రం చేసేస్తాడు. మమ్మల్ని కేవలం ఇంటి కాపలా కోసమనే కాదు.. విపత్తుల సమయంలోనూ, సరిహద్దుల భద్రతల విషయంలోనూ వాడాలన్నదే దీని తయారీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఇదిగో నన్ను ఎత్తుకున్న మా సంస్థ ప్రతినిధి కృష్ణచైతన్య చెబుతున్నాడు.
అన్నట్లు అసలైన విషయం మీకు చెప్పలేదు కదా.. ఇంట్లో పెంచిన కుక్కలైనా.. కొన్ని సార్లు యజమానులపై దాడి చేస్తుంటాయి కదా.. నేను కూడా ఆ టైపేనండోయ్. నన్ను ఎవరైనా సైబర్ నేరగాళ్లు హ్యక్ చేశారనుకోండి. ఇక తగ్గేదేలే. వీడు.. వాడు అని చూడను. దాడి చేసెయ్యడమమే. ఇలాంటిదేదో జరుగుతుందని తెలిసే.. మా ఫైటెక్ వాళ్లు.. నాలో ఫైర్‌వాల్ ఫర్మ్‌వేర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా హ్యాక్ చేసేందుకు ట్రై చేస్తే.. వెంటనే మా యజమానికి వార్నింగ్ అలారం వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే పూర్తిగా నన్ను షట్‌డౌన్ చేసేస్తారు. ఇదే అలారం వార్నింగ్ నన్ను తయారు చేసిన ఫైటెక్‌కి కూడా వెళ్తుంది. వాళ్లు కూడా క్షణాల్లో వార్నింగ్‌ని డిటెక్ట్ చేసి.. హ్యాక్ అవ్వకుండా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసేశారు.
ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే.. నా ధర ఎంతో తెలుసా.? భయపడొద్దే... జస్ట్ రూ.2.5 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నా. అంతే.!
టైమవుతోంది.. బైబై వైజాగ్.!!
మీ ఇంటికొస్తా.. కాపలాకాస్తా..
ఎగురుతా.. దూకుతా..
పాకుతా.. ఫ్రెండ్ షిప్ చేస్తా
విపత్కర పరిస్థితుల్లో
సాయమందిస్తా...
ఇదీ రోబో డాగ్ విశిష్టత
Comments
Please login to add a commentAdd a comment