తాటిచెట్లపాలెం: భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం కేకే లైన్‌లో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో జగదల్‌పూర్ వరకే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
● ఈ నెల 6న విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్ జగదల్‌పూర్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 7వ తేదీన కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ జగదల్‌పూర్ నుంచి బయల్దేరుతుంది.
● ఈ నెల 5వ తేదీన విశాఖపట్నం–కిరండూల్ (18514) నైట్ ఎక్స్‌ప్రెస్ జగదల్‌పూర్ వరకు మాత్రమే నడుస్తుంది, తిరుగు ప్రయాణంలో ఈ నెల 6వ తేదీన కిరండూల్– విశాఖపట్నం(18513) ఎక్స్‌ప్రెస్ జగదల్‌పూర్ నుంచి బయల్దేరుతుంది.
నేడు జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశంలో శుక్రవారం నిర్వహించనున్నారు. మేయర్, స్థాయీ సంఘ చైర్‌పర్సన్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన ఉదయం 11 గంటల నుంచి జీవీఎంసీ స్థాయీ సంఘ సమావేశ మందిరంలో నిర్వహించనున్న సమావేశంలో 42 అజెండా అంశాలు సభ్యుల దృష్టికి చర్చకు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment