రేపే అప్పన్న వైకుంఠద్వార దర్శనం
సింహాచలం: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వైకుంఠ (ఉత్తర)ద్వార దర్శనానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయం 5 నుంచి 10.30 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం లభించనుంది. ఈసారి 45 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.
1 గంట నుంచే వైదిక కార్యక్రమాలు
పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఆలయ అర్చకులు శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి వైకుంఠనారాయణుడి అలంకరణ చేసి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా పల్లకిలో అధిష్టింజేస్తారు. ఆలయ బేడా మండపంలో 3.30 నుంచి 4.15 వరకు తిరువీధి నిర్వహిస్తారు. 4.15కు స్వామిని ప్రధాన ఆలయ ఉత్తరద్వారం వద్దకు తీసుకొచ్చి ఆయనపై ఉండే మేలిముసుగుని తొలగిస్తారు. సంప్రదాయం మేరకు అక్కడ దేవస్థానం అనువంశిక ధర్మకర్తకి తొలిదర్శనం కల్పిస్తారు. అనంతరం స్వామిని ఉత్తర రాజగోపురంలో కొలువుంచుతారు. ఉదయం 10.30 వరకు అక్కడే భక్తులకు ఉత్తర ద్వార దర్శనరం కల్పిస్తారు. 10.30 నుంచి 11.30 వరకు సింహగిరి మాడ వీధిలో తిరువీధి నిర్వహిస్తారు.
45 వేల
మందికి పైగా భక్తులు వస్తారని అంచనా
ఉదయం 5
నుంచి 10.30 వరకు ఉత్తర
ద్వార దర్శనం
Comments
Please login to add a commentAdd a comment