స్టీల్‌ప్లాంట్‌కి ద్రోహం.. మిట్టల్‌కి దాసోహం
ఉక్కునగరం: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి విశాఖ వస్తున్నాడు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడానికి 1,427 రోజులుగా నిరాహార దీక్షలు చూసి కరిగి ఉంటాడు.. తమకు ఉపశమనం కలిగిస్తాడని ఆశగా ఎదురు చూసిన స్టీల్‌ప్లాంట్ కార్మికులకు నిరాశ ఎదురైంది. ప్రధాని స్టీల్‌ప్లాంట్ ప్రస్తావన తీసుకురాకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎన్నికల ముందు ఊదర కొట్టాం.. గెలిచిన తర్వాత మొదటి సారి విశాఖ ప్రధాని వచ్చాడు.. అతనికి విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశాన్ని చెప్పి ప్రైవేటీకరణ ఆపండి.. సెయిల్‌లో విలీనం చేయండి.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు చెబుతారని ఎదురు చూసిన ఉక్కు వర్గాలను వారి తీరు నివ్వెరపోయేలా చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశాన్ని ప్రస్తావించకపోగా మిట్టల్ స్టీల్‌ప్లాంట్ కోసం పైపు లైన్ కావాలంటూ చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం స్టీల్‌ప్లాంట్ కార్మికులకు పుండు మీద కారం చల్లినట్టు అయింది.
పోరాట కమిటీ నాయకుల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment