సీతమ్మధార/మద్దిలపాలెం: విశాఖ సాక్షిగా మోదీ మరోసారి ద్రోహం చేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, సొంత ముడి ఇనుప ఖనిజ గనుల కేటాయింపు, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ కింద రూ.18 వేల కోట్లపై ప్రధాని ప్రకటన చేయకపోవడం బాధాకరమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.గంగారావు, జిల్లా కార్యదర్శులు ఎం. పైడిరాజు, ఎం.జగ్గునాయుడు ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. విశాఖకు, ఉత్తరాంధ్రకు లబ్ధి చేకూర్చే ఏ ప్రకటనా చేయకపోవడం మరోసారి ద్రోహం చేయడమేనన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌కి అవసరమైన ముడి ఇనుప ఖనిజం సరఫరా, ఇతర అనుమతుల గురించి సాగిల పడి మాట్లాడటం విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ద్రోహం చేయడమేనని అన్నారు. కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీడీపీ, జనసేన కూటమి కలిసి మిట్టల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బలిచ్చేలా కుట్ర పన్నినట్టు బుధవారం మోదీ బహిరంగ సభతో తేలిపోయిందన్నారు. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
మిట్టల్ స్టీల్‌ప్లాంట్ కోసం
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను బలిస్తారా?
సీపీఎం విశాఖ జిల్లా కమిటీ
Comments
Please login to add a commentAdd a comment