11న ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
బీచ్‌రోడ్: ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల 19వ రాష్ట్ర మహాసభ తిరుపతిలో ఈ నెల 11న నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. నగరంలోని పెదవాల్తేరు అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేలా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ నేత పితాని ప్రసాద్ మాట్లాడుతూ దేశ జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలు కులాల పేరిట విడిపోవడం వల్లే న్యాయమైన డిమాండ్లు కూడా సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో డబ్బీరు కుమారస్వామి, రవికుమార్, వి.శ్యాంసుందర్, అన్నాజీరావు, పెద్దిరెడ్డి రాజశేఖర్, భాస్కర్, నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment