ప్రధాని సభకు వచ్చిన ముగ్గురికి అస్వస్థత
మహారాణిపేట: ప్రధానమంత్రి రోడ్డు షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రావాడ రామారావుకు ఫిట్స్ రాగా, రత్నం కడుపునొప్పికి గురయ్యారు. లక్ష్మి కాలికి దెబ్బతగిలింది. వీరికి డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు, డాక్టర్ భరత్, 108 వాహనం జిల్లా కో–ఆర్డినేటర్ వి.త్రినాథరావు, సిటీ కో–ఆర్డినేటర్ ఎం.సురేష్ ప్రథమ చికిత్స అందించి.. కేజీహెచ్‌కు తరలించారు.
ఆలస్యంగా బయల్దేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్
తాటిచెట్లపాలెం: విశాఖపట్నంలో బుధవారం మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరాల్సిన విశాఖపట్నం–దుర్గ్(20830) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు 3 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరింది. ఈ మార్గంలో జరుగుతున్న భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం ఈ రైలు ఆలస్యంగా బయల్దేరినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి.
క్యారమ్స్ జాతీయ విజేత జనార్దన్‌రెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ క్యారమ్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నెల్లూరులో జరుగుతున్న 29వ ఆలిండియా క్యారమ్స్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో విశాఖకు చెందిన సీహెచ్ జనార్దనరెడ్డి టైటిల్ కై వసం చేసుకున్నారు. 70 ఏళ్ల తర్వాత ఆంధ్రాకు టైటిల్ దక్కడం విశేషం. రన్నరప్‌గా జెయిన్ ఇరిగేషన్‌కు చెందిన బీతి సందీప్ దైవ్ నిలిచారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ను సాధించిన తెలుగువాడిగా నిలవడం ఆనందంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment