ఏయూ సెర్చ్ కమిటీ ఏర్పాటు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్(వీసీ) నియామక ప్రక్రియలో మరో ముందడుగు పడింది. యూనివర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి గౌహతి ఎన్‌ఐపీఈఆర్ డైరెక్టర్ ఆచార్య యూఎస్‌ఎన్ మూర్తి, ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తరఫున ముంబయిలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ ఆచార్య ఎస్.మహేంద్రదేవ్, యూజీసీ నుంచి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ఆచార్య భట్టు సత్యనారాయణను నియమించారు. దీంతో వర్సిటీకి వీసీ నియామక ప్రక్రియ వేగవంతమైనట్లయింది. ఏయూ వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు వందకు పైగా అభ్య ర్థుల్లో ముగ్గురి పేర్లను సెర్చ్ కమిటీ ఎంపిక చేయనుంది. వర్సిటీ ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ శశిభూషణరావు, రిజిస్ట్రార్ ధనుంజయరావుతో పాటు, పలువురు ఆచార్యులు సైతం దరఖాస్తు చేశారు. సెర్చ్ కమిటీ ముగ్గురు పేర్లను ఖరారు చేసి, గవర్నర్ ఆమోదానికి పంపిస్తారు. గవర్నర్ ఆమోదం మేరకు ప్రభుత్వం వీసీ పేరును ప్రకటించనుంది. నిబంధలను ఎలా ఉన్నా.. ప్రభుత్వం ఆశీస్సులున్న వారికే వీసీ పోస్టు దక్కుతుందనేది జగమెరిగిన సత్యం. దీంతో ఆశావహులంతా లాబీయింగ్ కోసం కూటమి పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు.
వీసీ ఎంపికకు కసరత్తు షురూ
Comments
Please login to add a commentAdd a comment