బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పరశురామరాజు
ఎంవీపీకాలనీ: బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా నూతన అధ్యక్షుడిగా మంతెన నాగ పరశురామరాజు నియమితులయ్యారు. మంగళవారం లాసన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేఽశంలో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధికారికంగా ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ స్టీల్ ప్లాంట్‌పై విశాఖ ప్రజలకు ఎలాంటి సందేహం అవసరంలేదన్న ఆయన ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకునేది లేదన్నారు. కూటమిలో భాగమైన తనకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానంటే ఆనందమేనన్నారు. బెట్టింగుల్లో రాజకీయ, అధికార వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటే ఉపేక్షించవద్దని పోలీసుశాఖకు సూచించారు. అనంతరం పరశురామరాజును పార్టీ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీవిశ్వనాథరావు, విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, సుహాసిని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment