28న వాలీబాల్‌ క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

28న వాలీబాల్‌ క్రీడాకారుల ఎంపిక

Published Tue, Aug 27 2024 12:34 AM | Last Updated on Tue, Aug 27 2024 12:34 AM

-

విజయనగరం: జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 28న ఉమ్మడి విజయనగరం జిల్లా బాల, బాలికలకు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ ప్రతినిధి కేవీఎఎన్‌ రాజు సోమవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు విజయనగరం జిల్లా కేంద్రంలో గల రాజీవ్‌ క్రీడామైదానంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనబోయే క్రీడాకారులు 14 నుంచి 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా బాలురు 185 సెంటిమీటర్ల ఎత్తు, బాలికలు 170 సెంటిమీటర్ల ఎత్తు కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చే నెల 1న విశాఖలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ కోసం పంపించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 8919421590, 9550785141 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement