టీడీపీ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలి
నెల్లిమర్ల: కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాలన సాగిస్తున్నారని, ఆమెను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని జనసేన పార్టీ నాయకులు అప్పికొండ రవికుమార్, రవ్వా నాని, నల్లి చంద్రశేఖర్, నక్కాన వెంకటరావు, చాప శ్రీను అన్నారు. నెల్లిమర్ల పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మాధవిపై టీడీపీ నాయకుల వైఖరి అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఆ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పలువురు ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. అలాగే ఇటీవల జరిగిన నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జనసేన నాయకుల కంటే టీడీపీ నాయకులకే ఎమ్మెల్యే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే మాధవిపై టీడీపీ నాయకులు తమ వైఖరి మార్చుకుని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో నాయకులు మజ్జి రాంబాబు, పలిశెట్టి దొరబాబు, సారిపల్లి శంకరరావు, మద్దిల అప్పన్న, తుమ్ము వెంకటరమణ, ఫలణికుమార్, వాసు, చందక సంతోష్, గాంధీ, కుమార్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాధవిని విమర్శించడం సరికాదు
జనసేన పార్టీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment