రాష్ట్రంలో విద్యా వ్యాపారం
● రాష్ట్ర రాజకీయాల్లో విద్యా వ్యాపారులదే కీలక పాత్ర ● విద్యా రంగాన్ని కాపాడుకోవాలి ● టీచర్స్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థిగా విజయగౌరి ● యూటీఎఫ్ స్వర్ణోత్సవ సభలో శర్మ
జామి: రాష్ట్రంలో ప్రస్తుతం విద్యను వ్యాపారంగా మార్చేశారని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ధ్వజమెత్తారు. జామిలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ముందుగా యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్యను వ్యాపార రంగంగా మార్చిన కొందరు ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విద్యా రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రస్తుతం చదువును కొంటున్నారని, దీన్ని విడనాడి చదువు నేర్చు కోవాలని హితవు పలికారు. విద్య కార్పొరేట్ చేతు ల్లో బందీగా మారిందని, దీన్ని కాపాడాల్సిన బాధ్య త మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం ఉన్నత విద్యను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయగౌరి
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా కె.విజయగౌరి బరిలో ఉంటారని శర్మ ప్రకటించారు. యూటీఎఫ్ సభ్యులుగా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటిస్తూ విజయానికి కృషి చేయాలన్నా రు. అర్హులైన టీచర్లను ఓటరుగా నమోదు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ సభ్యులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment