ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందాం..
● మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు
పూసపాటిరేగ : వైఎస్సార్‌సీపీ అధిష్టానం నిర్దేశించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని సమష్టిగా పని చేసి గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని రెల్లివలస గ్రామంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశాలతో జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థిని గెలిపించుకుందామని ఎంపీటీసీలు, జెడ్పీటీసీకి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించేందుకు అవసరమైన పూర్తి బలం ఉన్న వైఎస్సార్‌సీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. అమలు కాని హామీలతో ప్రజలను మోసపుచ్చే కూటమి నేతలను తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షు డు పతివాడ అప్పలనాయుడు, ఎంపీపీ మహంతి కల్యాణి, ప్రజాప్రతినిధులు మహంతి శ్రీనివాసరావు, మహంతి జనార్ధనరావు, గుజ్జు సురేష్‌రెడ్డి, పడాల శ్రీధర్, పిన్నింటి కు మార్, దేశెట్టి గణేష్, చాపల సత్తిబాబు, డి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక ప్రదేశాల సందర్శన
సీతంపేట: మండలంలోని పర్యాటక ప్రదేశాల ను ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆది వారం సందర్శించారు. పర్యాటకంగా ఇంకా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలోనని పరిశీలించారు. అనంతరం సున్నపుగెడ్డ జలపాతాన్ని సందర్శించి అక్కడ టూరిజం పరంగా ఏ పనులకు ప్రతిపాదించాలో సమాలోచన చేశారు.
108లో ప్రసవం
సీతంపేట: మండలంలోని గోరపాడుకు చెందిన బి.జానకి 108 అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డను ఆదివారం ప్రసవించింది.గారపాడుకు చెందిన జానకికి పురిటినొప్పులు తీవ్రంగా ఉన్నాయన్న సమాచారం ఆశ వర్కర్ ద్వారా అందుకున్న 108 అంబులెన్స్ గారపాడు గ్రామానికి చేరుకుంది. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో సీతంపేట తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో ఈఎంటీ రాములు, పైలట్ రామారావులు ఆశ వర్కర్ సహయంతో డెలివరీ చేశారు. అనంత రం తల్లీబిడ్డలను సీతంపేట ఏరియా ఆస్పత్రి లో చేర్పించారు. 108 సిబ్బంది చొరవను కుటుంబసభ్యులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment