నదీస్నానాల వద్ద జాగ్రత్త చర్యలు
విజయనగరం క్రైమ్: కార్తీకమాసం సందర్భంగా జిల్లాలో ఎక్కువ మంది భక్తులు వచ్చే శివాలయాలు, స్నానాలు ఆచరించే నదులు, సముద్రం, పికినిక్స్, వన భోజనాలు నిర్వహించే ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు, జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్తీకమాసం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు నదులు, సముద్ర స్నానాలు ఆచరించే అవకాశమున్నందున పోలీస్‌స్టేషన్ పరిధిలోని నదీ స్నానాలు ఆచరించే ప్రాంతాలను గుర్తించి, ఆయాప్రాంతాల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరికబోర్డులు ఏర్పాటుచేయాలని, యువత నదుల్లో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా బందోబస్తు, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కార్తీక మాసంలో సోమవారాలు, ముఖ్య రోజుల్లో ఎక్కువ మంది భక్తులు శివాలయాలకు వచ్చే అవకాశమున్నందున పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన శివాలయాలను గుర్తించి, బందోబస్తు ఏరాచచేయాలని, ఎటువంటి దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు.
ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment