రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఆదివారం పూర్తయింది. చెస్ అసోసియేషన్ ఆఫ్ విజయనగరం, ఫైర్ చెస్ స్కూల్ సంయుక్త ఆద్వర్యంలో విజయనగరంలోని ఫైర్‌చెస్ స్కూల్‌లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి చెస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఈఓ కేవీ.జ్వాలాముఖి ఆద్వర్యంలో ఎంపికలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపిక పోటీల్లో ఓపెన్ విభాగంలో ప్రథమ విజేతగా సీ.హెచ్.వినీల్ రాధా కార్తీక్, ద్వితీయ విజేతగా ఎం. కార్తీక్ గెలుపొందారు. బాలికల విభాగంలో ప్రథమ విజేతగా కె.మోక్ష, ద్వితీయ విజేతగా ఎన్.అమృత గెలుపొందారు. ఈ పోటీలలో విజేతలుగా గెలుపొందిన వారు ఈ నెల 18,19,20 తేదీలలో తాడేపల్లిగూడెంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. కార్యక్రమంలో పి.అర్చన, ఎన్.పద్మ, ఎ.దామోదర రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment