వసతుల్లేక అవస్థలు
ప్రస్తుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులకు, యంత్ర పరికరాలు అమర్చేందుకు పూర్తి స్థాయి లో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకటి రెండు విభాగాలకు ప్రొఫెసర్లు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గదులు చాలక ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యంత్ర పరికరాలు ఏర్పాటు చేయడానికి గదులు చాలక వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఆస్పత్రి వైద్య కళాశాల ఏర్పాటుతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారింది. రోగులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. రోగులకు పడకలు చాలక వరండాలో కొన్ని సందర్భాల్లో చికిత్స అందిస్తున్నారు. రోగులకు తగ్గట్టుగా వార్డుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment