దగాపడిన ఖాతాదారులు, ఏజెంట్లు, డిపాజిట్‌దారులు ఎస్.కోట పట్టణంలోని బ్యాంకు కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా
సహారా బ్యాంకు తీరుతో దగాపడిన ఖాతాదారులు, ఏజెంట్లు, డిపాజిట్‌దారులు ఎస్.కోట పట్టణంలోని బ్యాంకు కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. దేవీ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారు చర్యలు తీసుకోవాలంటూ నినదించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆలిండియా సహారా బాధితుల సంఘ నాయకురాలు పూజిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మినేని సూర్యనారాయణ, సహారా జోనల్‌మేనేజర్లు రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. – శృంగవరపుకోట
Comments
Please login to add a commentAdd a comment