మహిళా పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
విజయనగరం క్రైమ్: స్టైపెండరీ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియమాకాలకు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ పరీక్షల ప్రక్రి యను ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం ప్రారంభించారు. 550 మందికి 314 మహిళా అభ్య ర్థులు హాజరయ్యారు. దేహదారుఢ్య పరీక్షలను ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.
ఉచితంగా లైఫ్ సర్టిఫికెట్స్
● రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దార్ల సంఘం
విజయనగరం అర్బన్: పింఛన్‌దార్లకు లైఫ్ సర్టిఫికెట్స్‌ను స్థానిక పింఛన్‌దారుల సంఘం భవనంలో ఉచితంగా అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదార్ల సంఘం అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు తెలిపారు. పింఛన్‌దారులు తమ ఆధార్ కా ర్డు, ఫోన్ నంబర్, పింఛన్ పుస్తకం తీసుకొని నేరు గా సంఘ కార్యాలయాలని రావాలని కోరారు.
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందేందుకు నిరుద్యోగ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఎన్‌టీఆర్‌సీఎస్‌డీ అండ్ ఈడబ్ల్యూ జిల్లా మేనేజర్ పి.విమల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. సూయింగ్ మెషిన్ ఆపరేటర్ (45 రోజులు), మగ్గం వర్క్, బేకరీ ప్రొడెక్ట్స్ (30 రోజు లు) కోర్సులకు 8వ తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులన్నారు. అసిస్టెంట్ బ్యూటీ థెరి ఫిస్ట్ (60 రోజులు) ఉపాధి కోర్సుకు 10 తర గతి కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 10వ తేదీలోపు స్థానిక మహిళా ప్రాంగణానికి అందజేయాలని సూ చించారు. వివరాలకు సెల్: 83339 21338, 93463 28789 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment