అవకాశాలను అందిపుచ్చుకోవాలి
విజయనగరం అర్బన్: ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను, అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కలెక్టర్ శనివారం ప్రారంభించారు. విద్యార్థులకు కాసేపు వడ్డించారు. అనంతరం వారిలో కలిసి భోజనం చేశారు. భోజన పథకం వల్ల జిల్లాలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 4,660 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ ఎం.ఆదినారాయణ, డీఈఓ యు.మాణిక్యంనాయుడు, మధ్యా హ్న భోజన పథకం ఏడీ గోపీకృష్ణ, ఎంఈఓలు పీవీపీఆర్‌సీహెచ్ రాజు, కె.సత్యవతి, కళాశాల ప్రిన్సిపాల్ వీకేవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి విద్యార్థులే ఆస్థి
గజపతినగరం: విద్యార్థులే రాష్ట్రానికి ఒక ఆస్థి అని, వారి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బోజన పథకాన్ని శనివారం ఆయన ప్రారింభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చక్కగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రకాష్‌రావు పట్నాయక్, ప్రభుత్వ డిగ్రి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.సత్యానారాయణ, ఎంఈఓలు విమలమ్మ, సాయిచక్రధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment