6 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!
విజయనగరం ఫోర్ట్: పేదోడి ఆరోగ్యానికి సంజీవినిలాంటి ఆరోగ్యశ్రీపథకం సేవలు నిలిచిపోయే రోజు వచ్చింది. జిల్లాలోని నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.20కోట్ల బకాయిల చెల్లింపులో కూటమి సర్కారు అలసత్వం కారణంగా వైద్య సేవలకు అటంకం కలగనుందన్న వార్త పేద, మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామంటూ ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) ట్రస్టు సీఈఓకు నెట్‌వర్క్ ఆస్పత్రులు నోటీసు ఇచ్చాయి. దీంతో ఇప్పటికే ఆస్పత్రుల్లో చేరిన రోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని అభి నవ్, కొలపర్తి, సాయి పీవీఆర్, సాయి సూపర్ స్పెషాలటీ, వెంకటరామ, ఆంధ్ర, మారుతి, పీజీ స్టార్, స్వామి ఐ, నెప్రోప్లస్, మిమ్స్, మువ్వ గోపాల, గాయత్రి, పుష్పగిరి, తిరుమల మెడికవర్, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, పిలిడోపియా, సౌజన్య ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందజేస్తున్నాయి. వందలాది మంది వైద్యసేవలు పొందతున్నారు. సేవలు నిలిచిపోతే ప్రాణాలు పోతాయంటూ రోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించి సేవలు పునరుద్ధరించాలని కోరుతున్నారు. ప్రైవేటు నెట్ వర్క్ ఆస్పత్రుల నిర్వాహకులు ఈ నెల 6వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తామని ట్రస్టు ఉన్నత అధికారులకు నోటీసు ఇచ్చారని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ కొయ్యాన అప్పారావు తెలిపారు.
● సేవలు నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు నోటీసులిచ్చిన
నెట్‌వర్క్ ఆస్పత్రులు
● రూ.20 కోట్ల బకాయిల చెల్లింపులో జాప్యమే కారణం
Comments
Please login to add a commentAdd a comment