No Headline
మానవజన్మకు మూలమైన ‘గర్భ’గుడికి కత్తిగాట్లు పడుతున్నాయి. కాసుల కక్కుర్తితో కొందరు... కడుపుకోసి బిడ్డను తీసేస్తే పని అయిపోతుందిలే అని మరికొందరు...గర్భిణుల బంధువుల ఒత్తిడి, కంగారు పడడంతో ఇంకొన్ని... ఇలా తల్లి కడుపు.. కత్తి కోతలతో నిండిపోతోంది. సాధారణ ప్రసవాల సంఖ్యకంటే సిజేరియన్ల కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. గతంలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితమైన ఈ ఒరవడి.. ఇప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లోనూ కొనసాగుతుండడం కలవరపెడుతోంది.
‘ ఎం.రాములమ్మ అనే గర్భిణి ప్రసవం కోసం కొద్ది రోజుల కిందట ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి ప్రసవం జరిపించారు.’
‘ కొద్దిరోజుల కిందట రామభద్రపురం మండలానికి చెందిన కె.రామయ్యమ్మ ప్రసవం కోసం ఘోష ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆస్పత్రి వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం జరిపించారు.’
‘ చీపురుపల్లి మండలానికి చెందిన వి.రమణమ్మ అనే మహిళ ప్రసవం కోసం అక్కడి సీహెచ్‌సీలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి ప్రసవం జరిపించారు.’
Comments
Please login to add a commentAdd a comment