ఆకట్టుకున్న ఎడ్ల పరుగు ప్రదర్శన
● మొదటి స్థానంలో నిలిచిన కేఎల్‌బీ పట్నం ఎడ్లు
వేపాడ: మండలంలోని వీలుపర్తిలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. గ్రామదేవత నేరేళ్ల పైడితల్లమ్మ అమ్మవారి తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో15 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. వాటిలో కేఎల్‌బీ పట్నంకు చెందిన బండారు హేమతేజ ఎడ్లు ప్రథమస్థానం, రెండోస్థానంలో అదనగిరికి చెందిన పరవాడ నాయుడు ఎడ్లు, మూడోస్థానంలో దేవరాపల్లికి చెందిన లక్ష్మినరసింహా ఎడ్లు, నాల్గో స్థానంలో చుక్కపల్లికి చెందిన సామాలమ్మ ఎడ్లు, ఐదోస్థానంలో వావిలపాడుకు చెందిన చుక్కమాంబ ఎడ్లు నిలిచాయి. వారికి వరుసగా రూ.20 వేలు, రూ.15వేలు, రూ.10 వేలు, రూ.8వేలు, రూ.5వేలు చొప్పున నగదు బహుమతులను సర్పంచ్ శానాపతి అప్పారావు లీలా దంపతులు తదితర కమిటీ సభ్యులు సహకారం అందించిన దాతల చేతుల మీదుగా అందజేశారు. అమ్మవారికి ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment