ఏకకాలంలో రీ సర్వే వినతుల పరిష్కారం
విజయనగరం అర్బన్: రీ సర్వే వినతులను పీజీఆర్‌ఎస్‌లో అప్లోడ్ చేయడం, చేసిన వాటిని వెంటనే పరిష్కరించడం ఏక కాలంలో జరగాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. అప్లోడ్ చేసిన వాటిని పరిష్కరించకపోవడం వల్ల వాటి సంఖ్య ఆన్‌లైన్‌లో ఎక్కువగా కనపడుతోందన్నారు. మండలాల వారీగా సర్వేయర్లతో కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. రీ సర్వే వినతుల పరిష్కారానికి మండల వారీగా లక్ష్యాలను ఇచ్చి వేగంగా పరిష్కారం జరిగేలా చూడాలని జేసీ సేతుమాధవన్‌కు సూచించారు. సర్వే శాఖ ఏడీ ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులలో డూప్లికేషన్ తీసేసి మిగిలిన వాటిని పీజీఆర్‌ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా అప్‌లోడ్ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. పరిష్కరించిన వినతులను డిప్యూటీ కలెక్టర్లు ఆడిట్ చేయాలని, ఒక్క వినతికి తప్పుడు సమాధానం ఇచ్చినా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసరావు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీ ల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవు
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment