అప్రమత్తతతో సైబర్ మోసాలకు చెక్
విజయనగరం క్రైమ్: మహిళల డీపీలు, వాయిస్, వీడియోలతో వచ్చే కాల్స్‌తో హానీట్రాప్‌లకు పాల్పడే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని, అటువంటి సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. హనీట్రాప్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్‌శాఖ రూపొందించిన షార్ట్ వీడియోను జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా పోలీస్‌శాఖ ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించిందన్నారు. హనీ ట్రాప్ పేరుతో కొందరు మహిళలు ప్రజలను ఉచ్చులోకి దింపేవిధానం, ఆయా మోసాల నుంచి బయటపడే పద్ధతులను షార్ట్ ఫిల్మ్‌లో పొందుపరిచామన్నారు. షార్ట్‌ఫిల్మ్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరవచేసి అప్రమత్తం చేస్తామన్నారు. సైబర్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ పోర్టల్‌కు, లేదంటే 1930కి ఫోన్ చేయాలన్నారు. షార్ట్‌ఫిల్స్‌ను రూపొందించిన విశాఖకు చెందిన మీడియా ఎఫెక్ట్స్ సభ్యులను, షార్ట్ ఫిల్మ్‌లో నటించిన పి.హరిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రం అందజేశారు. షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణలో విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్‌బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, ఎఫెక్స్ మీడియా యజమాని సంతోష్, హరి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్
హనీట్రాప్ షార్ట్ వీడియో ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment