No Headline
విజయనగరం ఫోర్ట్:
సాధారణ ప్రసవం తల్లీబిడ్డలకు ఆరోగ్యకరం. ప్రభుత్వాస్పత్రుల వైద్యులు అధికమంది సాధారణ ప్రసవం చేసేందుకే మొగ్గుచూపుతారు. తల్లీబిడ్డ ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తారు. ఇది మొన్నటివరకు అందరినోటా వినిపించిన మాట. ఇటీవల కాలంలో ప్రభుత్వాస్పత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతుండడం అందరినీ కలవరపెడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పెద్దగా తేడా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు సాధారణ ప్రసవాలు జరిపిస్తారనే భావన గర్భిణుల్లో ఉండేది. అధిక మంది గర్భిణులు ఆస్పత్రుల్లో చేరేవారు. ఇటీవల కాలంలో సిజేరియన్ల సంఖ్య పెరుగుతుండడం చర్చకు తావిస్తోంది. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ కేసులు తక్కువగా నమోదయ్యేవి. 20 నుంచి 30 శాతం సిజేరియన్లు జరిగేవి. ఇప్పడు వాటి సంఖ్య 45–50 శాతానికి చేరాయి.
సిజేరియన్లతో అనేక అనర్థాలు
సిజేరియన్ల వల్ల అనర్థాలే ఎక్కువ. తొలికాన్పుకు సిజేరియన్ చేస్తే రెండో కాన్పుకు కూడా సిజేరియన్ తప్పనిసరి. కడుపుకోతలు, మత్తు ఇంజిక్షన్ల వల్ల నరాలు బలహీనపడతాయి. కొందరిలో నడుం, కాళ్లు నొప్పులు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధారణ ప్రసవం అయితే రక్తస్రావం తక్కువగా అవుతుంది. సిజేరియన్ అయితే రక్తస్రావం అధికం కావడం వల్ల రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉందన్నది వైద్యుల మాట. అత్యవసరమైతే తప్ప సిజేరియన్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment