డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం అర్బన్: ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రటకనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభించనున్న 20వ బ్యాచ్ శిక్షణ 40 రోజులపాటు సాగుతుందన్నారు. లైట్ వెహికల్ లైసెన్స్‌తో పాటు డ్రైవింగ్‌లో ఒక సంవత్సరం అనుభవం ఉన్న 21 సంవత్సరాలు నిండిన వారు వెహికల్ లైసెన్స్ డ్రైవింగ్ శిక్షణకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సెల్: 73829 24030, 98667 49336 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment