జిల్లాలో సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రి, పీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసవసేవలు అందుతాయి. గజపతినగరం, రాజాం, ఎస్.కోట ఏరియా ఆస్పత్రులు, బాడంగి, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల, భోగాపురం సీహెచ్‌సీలు, ఘోష ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలతో పాటు సిజేరియన్లు జరుగుతాయి. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవసేవలే అందుతాయి. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో సిజేరియన్లు చేస్తారు. 9 నెలల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ ) వరకు జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో 6,585 ప్రసవ కేసులు నమోదుకాగా, వీటిలో 3,111 మంది (47 శాతం) గర్భిణులకు సిజేరియన్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్యరంగంపై నిర్లక్ష్యం ఆవహించిందని, సిజేరియన్ల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకునేవారు, పర్యవేక్షించేవారు లేరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
9 నెలల్లో 6,585
ప్రసవాలు
Comments
Please login to add a commentAdd a comment