హెచ్‌ఐవీపై సెంటినల్ సర్వే
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో హెచ్‌ఐవీ శాతం తెలుసుకునేందుకు ఎయిడ్స్ నియంత్రణశాఖ చేపట్టిన సర్వే సాగుతోంది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై జనవరి నెలలో ప్రారంభమైన సెంటినల్ సర్వే మార్చి నెలాఖరు వరకు సాగనుంది. సర్వే ద్వారా వచ్చిన నివేదిక అధారంగా నివారణ చర్యలు చేపట్టనున్నారు. గర్బిణులు నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. సెంటినల్ సర్వే ప్రతి రెండేళ్లకు ఒకసారి చేపడతారు. 2023లో చేపట్టారు. మళ్లీ ఇప్పుడు చేస్తున్నారు. ప్రతిబ్లడ్ శాంపిల్‌కు సిఫిలీస్, హెపటైటీస్–బి, హెపటైటీస్–సి, హెచ్‌ఐవీ పరీక్షలు చేస్తారు.
జిల్లాలో మూడు ఆస్పత్రుల ఎంపిక
సెంటినల్ సర్వే కోసం జిల్లాలోని ఘోషా ఆస్పత్రి, భోగాపురం, బాడంగి సీహెచ్‌సీలను ఎంపిక చేశారు. ఈ మూడు ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు. మూడు ఆస్పత్రులకు 800 బ్లడ్ శాంపిల్స్ సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో ఘోష ఆస్పత్రి నుంచి 400, మిగిలిన రెండు సీహెచ్‌సీలకు 200 చొప్పున లక్ష్యం నిర్దేశించారు. గర్భిణుల నుంచి సేకరించిన బ్లడ్‌శాంపిల్స్‌ను కేజీహెచ్‌కు పంపించి పరీక్షిస్తారు.
గర్భిణుల నుంచి బ్లడ్‌శాంపిల్స్ సేకరణ
ఘోషా ఆస్పత్రి, బాడంగి, భోగాపురం
సీహెచ్‌సీల నుంచి 800 శాంపిల్స్
సేకరణ
జిల్లాలో హెచ్‌ఐవీ రోగులు
7,979 మంది
జిల్లాలో హెచ్‌ఐవీ కేసులు ఇలా..
జిల్లాలో 2008 నుంచి ఇప్పటి వరకు 13,939 మంది హెచ్‌ఐవీ రోగులు రిజిస్ట్రర్ అయ్యారు. ప్రస్తుతం ఏఆర్‌టీ కేంద్రం నుంచి 7,979 మంది మందులు వాడుతున్నారు. వీరిలో పురుషులు 3,326 మంది, మహిళలు 4,332 మంది, పిల్లలు 321 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా 321 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాప్తిని తెలుసుకునేందుకు సెంటినల్ సర్వే చేపట్టినట్టు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి కె.రాణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment