3న చలో కలెక్టరేట్
విజయనగరం టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ర్యాపిడ్, వాలా ఏటీఎస్ (ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్) ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెల 3న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీ విజయదుర్గ ఆటోవర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నీలాపు అప్పలరాజురెడ్డి, రెడ్డి నారాయణరావు శనివారం తెలిపారు. ఈ మేరకు విజయనగరం మెసానిక్ టెంపుల్ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బాలి సన్యాసిరావు, చెన్నా ధర్మారావు, కంది రాము, గేదెల నారాయణరావు, తర్లాడ శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment