బొబ్బిలి రూరల్: మండలంలోని పలు పంచాయతీల పరిధిలో ఒకటో తేదీ ఉదయం నిర్దేశిత సమయానికి పెన్షన్ల పంపిణీ చేయని ఐదుగురు ఉద్యోగులకు డీఆర్‌డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి షోకాజ్ నోటీసులు జారీచేశారు. గొర్లెసీ తారాంపురం పంచాయతీ సెక్రటరీ మహ మ్మద్ అబ్దుల్‌కలాం, సర్వేయర్ రామకృష్ణ, రంగరాయపురం, చింతాడ గ్రామాల వీఆర్వోలు ఉప్పాడ గంగరాజు, గౌరీశంకర్‌తో పాటు జగన్నాథపురం సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఎస్.సునీల్‌కుమార్‌కు నోటీలను పంపించారు. గత మూడు నెలలుగా ఇదే తరహా నిర్లక్ష్యం చూపుతున్నారని, జనవరి నెలలో వీరికి మెమోలు ఇచ్చినా పనితీరులో మార్పురాకపోవడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు ఎంపీడీఓ పి.రవికుమార్ తెలిపారు. వచ్చేనెల ఇదే తరహా నిర్లక్ష్యం చేస్తే చార్జి మెమో ఇస్తారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment