–IIలో | - | Sakshi
Sakshi News home page

–IIలో

Published Sun, Feb 2 2025 1:28 AM | Last Updated on Sun, Feb 2 2025 1:28 AM

–IIలో

–IIలో

పీఎం సూర్యఘర్‌ యోజనను సద్వినియోగం చేసుకోవాలి

ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజనను

సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌

ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు.

క్లస్టర్ల ఏర్పాటుకు కసరత్తు!

పాఠశాల విద్యాశాఖలో కీలకమైన స్కూల్‌ కాంప్లెక్స్‌ల విధానాన్ని ప్రభుత్వం

రద్దు చేసింది.

వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే నిధుల కేటాయింపులో అన్యాయం జరిగింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించిన కూటమి ప్రభుత్వం... తీరా నిధుల సాధనలో బొక్కబోర్లాపడింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ల పూర్తి వైఫల్యమిది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినా నిధులు సాధించలేకపోయారు. ఎత్తు తగ్గిస్తున్నా చూస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఎందుకు పనికిరాకుండా పోతుంది. విజయనగరం జిల్లాకు చుక్కనీరు కూడా పారదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌ల ప్రస్తావన కేంద్ర బడ్జెట్‌లో లేకపోవడం శోచనీయం. – మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా

అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్మన్‌

వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యం

అధిక ఉత్పతులు వచ్చేలా వంగడాలను రైతులకు అందించేందుకు వీలుగా కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చారు. చిరుధాన్యాలు, పత్తి సాగు ప్రోత్సహించేలా మిషన్‌ ఏర్పాటు చేయడం సముచితం. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం లభించింది. చిరుధాన్యాల సాగు వైపు రైతులను ప్రోత్సహించేలా ఉంది.

– ఎంవీవీ శ్రీనివాస్‌, వ్యవసాయ శాస్త్రవేత్త,

ఏరువాక కేంద్రం

ఆంధ్రా ప్రజల చెవుల్లో

కమలం పుష్పాలు

పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ వార్షిక మాయా బడ్జెట్‌లో దేశప్రజల ఆర్థిక ప్రయోజనాల ప్రాధాన్యత కంటే కార్పొరేట్ల ఆర్థిక ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చెవుల్లో కమలం పుష్పాలు పెట్టారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ రంగానికి ఆర్థిక సాయంలో నిబద్ధత లేదు. 30 వేలు వరకు క్రెడిట్‌ కార్డులు అనే ప్రకటన హాస్యాస్పదం. పవన్‌ కళ్యాణ్‌ చేతిలో పదవి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి అన్యాయం జరగనివ్వరని ఆశించిన ఆంధ్రప్రజలు భంగపడ్డారు. బడ్జెట్‌ చూసి చంద్రబాబు, పవన్‌లు సిగ్గుపడాలి. పెరిగే ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు జేబులు ఖాళీ కావడం ఖాయం. ఇది ఢిల్లీ, బీహార్‌ రాష్ట్రాలకే బడ్జెట్‌లో అధిక కేటాయింపులు చేయడం విచారకరం.

– బుగత అశోక్‌, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, విజయనగరం

రాష్ట్రానికి మొండిచేయి

ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో మొండిచేయి చూపించారు. రాజధానికి నిధులు లేవు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన ఊసేలేదు. కనీసం ఆంధ్రా ఎంపీలు ఉలుకు పలుకు లేదు. వస్తు సేవల పన్ను పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు, వంట గ్యాస్‌ ధరలు తగ్గించలేదు.

– భీశెట్టి బాబ్జి, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

మరోసారి ద్రోహం

కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. బీహార్‌, ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ కేటాయింపులున్నాయి. 52 శాతం పైబడి ఆధారపడుతున్న వ్యవసాయ రంగానికి అరకొర కేటాయింపులు దారుణం. విద్యుత్‌ చార్జీల పెంపుతో ఫెర్రో పరిశ్రమలు మూతపడుతుంటే ఆ రంగాన్ని ఆదుకునే కేటాయింపులు లేవు. బీజేపీకి మద్దతుగా ఉన్న టీడీపీ ఎంపీలు దీనికి సమాధానం చెప్పాలి.

– పొట్నూరు శంకరరావు,

జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, సీపీఎం

పరిశ్రమలు నిలదొక్కుకునే అవకాశమేదీ?

ఫెర్రో వంటి పరిశ్రమలు మూతపడే దిశగా కునారిల్లుతున్నాయి. విద్యుత్‌ చార్జీల పెంపుతో పారిశ్రామిక రంగానికి కష్టాలు తప్పవు. బడ్జెట్‌ అంతా అంకెల గారెడీలా ఉందే తప్ప రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదు. యువతకు ఉపాధి అవకాశాలకు కేటాయింపులు లేవు.

– శంబంగి వెంకట చిన అప్పలనాయుడు,

మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

దేశమంటే మట్టి కాదోయ్‌... దేశమంటే మనుషులోయ్‌... మన మహాకవి గురజాడ అప్పారావును స్మరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులో మాత్రం ఈ వెనుకబడిన జిల్లాను విస్మరించారు. పార్లమెంట్‌లో శనివారం ఆమె ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్‌ జిల్లా ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలోనే టీడీపీ, జనసేన కీలక భాగస్వాములైనా ఉత్తరాంధ్రకే కాదు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే ఆర్థిక వరాలు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదాయపన్ను స్లాబుల్లో సవరణ ద్వారా మధ్యతరగతి, ఉద్యోగులకు మాత్రమే కాస్త ఊరట. వ్యవసాయానికి, ఎంఎస్‌ఎంఈలకు పెద్దపీట వేస్తామని హామీ ఇవ్వడం వ్యవసాయాధారిత, చిన్న పరిశ్రమలు అత్యధికంగా ఉన్న విజయనగరం జిల్లాకు భవిష్యత్తులో ఏమైనా ప్రోత్సాహకాలు ఉంటాయేమోననే కొత్త ఆశలు రైతులు, నిరుద్యోగ యువతలో రేకెత్తాయి. పేదలు, యువత, అన్నదాతలు, మహిళలే లక్ష్యంగా అభివృద్ధి చర్యలు తీసుకుంటామన్న నిర్మలమ్మ హామీ ఇవ్వడం ఈ బడ్జెట్‌లో కొసమెరుపు.

వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న విజయనగరం జిల్లాలో ప్రధానంగా వరి పంట 97వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు సుమారు 45 వేల మంది అడుగేశారు. ఫలితంగా 44 వేల ఎకరాల వరకూ ప్రకృతి విధానంలోనే వివిధ పంటల సాగు అవుతోంది. చిరుధాన్యాలు, అపరాల సాగును ప్రోత్సహించేలా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం ఆయా రైతులకు కాస్త ఊతమందే అవకాశం ఉంటుంది. వెయ్యి కోట్ల నిధులతో మిషన్‌ ఫర్‌ పల్సస్‌, మరో రూ.500 కోట్లతో మిషన్‌ ఫర్‌ వెజిటబుల్స్‌, ఫ్రూట్స్‌ ఏర్పాటుకానున్నాయి. అత్యధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను అందించేందుకు రూ.100 కోట్లతో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ హైబ్రిడ్‌ సీడ్స్‌ను ప్రకటించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు సాయమందించడమే లక్ష్యంగా వంద వ్యవసాయాధారిత జిల్లాలను అభివృద్ధి చేయడానికి ప్రకటించిన పీఎం ధన్‌–ధాన్య కృషి యోజనలో విజయనగరం కూడా ఉంటుందనే ఆశలు రైతుల్లో కనిపిస్తున్నాయి. రైతులకు, మత్స్యకారులకు, పాడిరైతులకు కేసీసీ ద్వారా స్వల్పకాలిక రుణ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడం శుభపరిణామం. ●

● చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కొన్ని పథకాలను ప్రకటించారు. ఉద్యం పోర్టల్‌లో చిన్న పరిశ్రమలను నమోదుచేసుకున్నవారికి రూ.5 లక్షల పరిమితితో క్రెడిట్‌ కార్డు సదుపాయం కల్పించడం జిల్లాలో సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్లో జీవనోపాధి పెంచడానికి ఉపయోగపడుతుంది. కొత్తగా పరిశ్రమలను పెట్టేందుకు ముందుకొచ్చే మహిళలు, ఎస్సీలు, ఎస్టీల సహా జౌత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల వరకూ రుణాలు ఇచ్చే పథకాన్ని ప్రకటించడం జిల్లాలో నిరుద్యోగ యువతకు కాస్త ప్రోత్సాహించే చర్యగానే చెప్పాలి.

● మేడ్‌ ఇన్‌ ఇండియా బ్రాండ్‌ను సుస్థిరం చేయడానికి వీలుగా బొబ్బిలి వీణలు, లక్కబొమ్మల తయారీలో నైపుణ్యాలను పెంచేందుకు, ఉత్పత్తుల మరింత నాణ్యతతో తీర్చిదిద్దేందుకు వీలుగా కేంద్ర బడ్జెట్‌లో ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇది మన జిల్లాలో వీణల తయారీకి పేరొందిన బొబ్బిలిలో ఈ పరిశ్రమ వృద్ధి చెందడానికి ఉపయోగపడే అవకాశం ఉంది.

● చాపకింద నీరులా కేన్సర్‌ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో డే కేర్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటుకానుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్‌లో హామీ ఇవ్వడం జిల్లాలో కేన్సర్‌ రోగులకు ఊరట కలిగించేదే.

● ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా జిల్లాలో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఇంతవరకూ 1.96 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. దీన్ని శతశాతం అమలుచేసేందుకు ఈ మిషన్‌ను 2028 వరకూ పొడిగించడం ఈ బడ్జెట్‌లో మరో సానుకూల అంశం.

● నీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు, పట్టణాలను గ్రోత్‌ హబ్‌లుగా తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్లను ఈ బడ్జెట్‌లో కేటాయించడం పట్టణ ప్రజలకు కాస్త ఊరట.

కూటమి ప్రభుత్వ వైఫల్యమే ఇది...

మధ్యతరగతి, ఉద్యోగులకు ఊరట...

ఆదాయపన్ను చెల్లించే జిల్లాలోని సుమారు 40 వేల మంది ఉద్యోగులు, ఇతరత్రా ఆదాయం ఉన్న మధ్యతరగతి వారికి కాస్త ఊరట కలిగించేలా స్లాబ్‌ల్లో సవరణ చేశారు. వార్షిక ఆదాయం రూ.4 లక్షల వరకూ ఉన్నవారు ఎటువంటి పన్నూ చెల్లించనక్కర్లేదు. ఇక రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ 5 శాతం, రూ.8 నుంచి రూ.12 లక్షల వరకూ 10 శాతం ఆదాయపన్ను ఉండేలా స్లాబ్‌లను సవరించడం వల్ల ఎక్కువ మంది ఉద్యోగులకు లాభం కలుగుతుంది.

మత్స్యకారులకు మేలు...

మత్స్యకారులకు మేలు కలిగేలా పూసపాటిరేగ మండలం మర్రిపేట గ్రామంలో రూ.2 కోట్ల నిధులతో మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలకు ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పథకం కింద మోక్షం కలగనుంది.

ప్రకృతిసాగుకు ప్రాధాన్యం

వెనుకబడిన జిల్లాకు కేంద్ర బడ్జెట్‌లో మొండిచేయి

నేరుగా నిధులు ప్రకటించని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఎంఎస్‌ఎంఈలు, ఔత్సాహిక

పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకం

వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వడంతో రైతుల్లో ఆశలు

ఆదాయపన్ను స్లాబుల మార్పుతో మధ్యతరగతికి కాస్త ఊరట

ఆదాయ పన్ను హెచ్చుస్థాయి స్లాబ్‌ సరికాదు

బడ్జెట్‌లో ఆదాయ పన్ను రూపంలో హెచ్చుస్థాయి స్లాబ్‌ను ఉంచడం సరికాదు. వినియోగదారులపై ఒక వైపు జీఎస్‌టీ రూపంలో పన్ను భారం ఉండగా ఇలా హెచ్చుస్థాయిలో స్లాబ్‌ చర్య మరింత భారం అవుతుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో తీసుకున్న చర్యలు బాగున్నాయి. అధిక వ్యవస్థలో సుమారు ప్రతి అంశాన్ని స్పృశించేలా బడ్జెట్‌ ఉంది.

– కాపుగంటి ప్రకాశ్‌, అధ్యక్షుడు,

విజయనగరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌

మౌలిక సదుపాయాల కల్పన

మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌ కేటాయింపులు ఇవ్వడం వల్ల ఆయా రంగాల వృద్ధికి అవకాశం ఉంది. విమానయానానికి సంబంధించి మన రాష్ట్రానికి బడ్జెట్‌లో ప్రత్యేక వరాలేవీ లేవు. ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షల వరకు పెంచారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఇది ఊరట నిచ్చిన అంశం.

– కురిమినేని అప్పలనాయుడు,

రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, ఆర్థిక విశ్లేషకుడు,

విజయనగరం

గొప్పలే తప్ప డబ్బుల్లేవు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గొప్పలే తప్ప రాష్ట్రానికి వచ్చిన డబ్బులేవి లేవు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేందుకు తామే కారణమంటూ బాకా ఊదిన చంద్రబాబునాయుడు బడ్జెట్‌ కేటాయింపుల్లో ఒక్క ప్రాజెక్ట్‌ కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. అమరావతి, మెట్రో రైలు ప్రస్తావన లేదు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక ఊతం లేదు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఎలా న్యాయం చేస్తారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. – తలే రాజేష్‌,

వైఎస్సార్‌ సీపీ రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి

No comments yet. Be the first to comment!
Add a comment
–IIలో1
1/13

–IIలో

–IIలో2
2/13

–IIలో

–IIలో3
3/13

–IIలో

–IIలో4
4/13

–IIలో

–IIలో5
5/13

–IIలో

–IIలో6
6/13

–IIలో

–IIలో7
7/13

–IIలో

–IIలో8
8/13

–IIలో

–IIలో9
9/13

–IIలో

–IIలో10
10/13

–IIలో

–IIలో11
11/13

–IIలో

–IIలో12
12/13

–IIలో

–IIలో13
13/13

–IIలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement