నాయకుల సేవలో పోలీసులు!
మెంటాడ: ప్రస్తుతం జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీనిని అమలుచేయాల్సిన పోలీస్ అధికారి అధికార పార్టీ నాయకుల సేవలో తరించడం విమర్శలకు తావిస్తోంది. ఓ ఇద్దరు టీడీపీ నాయకులను నేరుగా తన వాహనంలో మంత్రి ఇంటివరకు తీసుకెళ్లడం, వారి మన్ననల కోసం తాపత్రయ పడాన్ని చూసిన ప్రజలు ముక్కునవేలేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఎస్‌ఐ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నాయకులను వెంటబెట్టుకుని మంత్రి వద్దకు వెళ్లారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమి ‘రామ’భక్తి అంటూ కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment