![కొద్ది నెలల్లో మూడో లైన్ పూర్తి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05bbl01-370042_mr-1738783473-0.jpg.webp?itok=x_TldEQ2)
కొద్ది నెలల్లో మూడో లైన్ పూర్తి
బొబ్బిలి: మరి కొద్ది నెలల్లో రాయపూర్–విశాఖ మూడో లైన్ నిర్మాణం పూర్తవుతుందని డీఆర్‌ఎం మనోజ్ కుమార్ సాహు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన బొబ్బిలి పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆదర్శ రైల్వే స్టేషన్ నూతన భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సాలూరు–బొబ్బిలి ట్రైన్ ట్రిప్ త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయిందని, కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌లో దివ్యాంగులకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసిన ప్రాంతంలో వారికి వీలుగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలపై నిర్మాణ సామగ్రి ఉండడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయని వాటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈనెల 15న రైల్వే జీఎం స్టేషన్‌ను సందర్శిస్తారని చెప్పారు. మూడో లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను కోరారు. ఆయన వెంట స్థానిక రైల్వే సిబ్బంది ఉన్నారు.
డీఆర్‌ఎం మనోజ్‌కుమార్‌సాహు
Comments
Please login to add a commentAdd a comment