![జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05ppm108a-370059_mr-1738783473-0.jpg.webp?itok=L7DGaMC5)
జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందాలని పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల. తిరుపతయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో పార్వతీపురం మండలం నర్సిపురం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నేతృత్వంలో 11 చెరువుల్లో 2,74,710 చేప పిల్లలను, పీఎంఎంఎస్‌వైలో భాగంగా 16 చెరువుల్లో 1,27,200 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యసంపద అభివృద్ధి పెరిగితే మత్స్యకారుల సంపద పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మత్స్యకారుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారి యెల్లేటి. శ్రీదేవి, ఇరిగేషన్ ఏఈ (ఐటీడీఏ) జి.గౌరి నాయుడు, ఏపీఎం బి.సన్నిబాబు, మత్స్యకార సంఘం అద్యక్షడు మురుముళ్లు.శ్రీనివాస్, సింగిడి.గున్నారావు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment