![జాతీయరహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05nlm41-370034_mr-1738783474-0.jpg.webp?itok=bGx__d3j)
జాతీయరహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
పూసపాటిరేగ: జాతీయరహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వకుల్‌జిందాల్ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన నాతవలస జంక్షన్ నుంచి కందివలస వరకు జాతీయరహదారిపై ప్రమాదాలు జరిగే 32 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించారు. పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ ప్రహరీ గేటును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలలో స్టాపర్స్, సిగ్నల్స్, జీబ్రా మార్కులు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారిస్తామన్నారు. ఎన్‌హెచ్ 26లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంవల్ల 30 శాతం వరకు ప్రమాదాలు తగ్గాయని చెప్పారు. జాతీయరహదారి సర్వీసురోడ్డులో ప్రమాదాలు జరిగిన చోట రెయిలింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్పీతో పాటు డీఎస్పీ ఎం.శ్రీనివాసురావు, భోగాపురం రూరల్ సీఐ డి.రామకృష్ణ, ఎస్సైలు ఐ.దుర్గాప్రసాద్, ఎ.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్‌జిందాల్
Comments
Please login to add a commentAdd a comment